Showing posts with label Water(నీరు). Show all posts
Showing posts with label Water(నీరు). Show all posts

Pigeon Point Lighthouse

Pigeon Point Lighthouse
Exif: 35mm, F/6.3, 1/400s, ISO 200, Av mode, EC +0.7

దీపస్తంభం/దీపగృహం

కొన్నాళ్ళ క్రితం సెలవలకి Northern Californiaలో వెళ్ళినప్పుడు San Francisco-Big Basin Redwoods State Park దారిలో ఈ లైట్‌హౌస్‌ కనిపించింది. బాగుంది కదా అని ఫొటో తీసుకున్నామే కానీ అప్పట్లో మాకు తెలియనిది- 115 అడుగుల ఎత్తున్న ఈ కట్టడం US యొక్క పశ్చిమకోస్తాతీరప్రాంతంలో అతి పెద్ద లైట్‌హౌస్‌ అని మాత్రమే కాదు, ఆ ప్రక్కనే ఉన్న నాలుగు ఇళ్ళు కలిపి అక్కడ youth hostel నిర్వహిస్తున్నారని కూడా తెలియలేదు. ఆ హాస్టల్లో సాయంత్రాలు సూర్యాస్తమయంతో పాటూ బెలీన్‌ తిమింగలాలను చూస్తూ, రాత్రుళ్ళు ఆరుబయట లక్షల నక్షత్రాలతో పాటూ అకాశంలోనూ అలల్లోనూ తచ్చట్లాడుతున్న చంద్రుడ్ని చూస్తూ ఆ అలల హోరుకి నిద్రపోతే ఎంత బాగుంటుందీ.. !! ఒక మాంఛి అవకాశం తప్పిపోయింది.

During our vacation in Northern California sometime back, we came across this lighthouse on our way to Big Basin Redwoods State Park from San Francisco. What we didn't know at that time was- not just that this 115-foot high lighthouse is the tallest of its kind in on the West Coast of the United States, but also that the few houses just adjacent to lighthouse are operated as a Hostel. How cool would it be to spend your evenings watching gray whales and sunsets, nights watching zillions of stars and moon reflecting in the waters below and sleep to the sound of waves crashing against the rocks!!! One missed opportunity.

Spring/నీటిబుగ్గ/చెలమ

IMG_3685b1
Exif: 19mm, F/8, 1/125s, ISO 200, Av mode, EC -0.3

వీకీవాచీ నదిలో పడవ ప్రయాణం. నీటిబుగ్గలు/చెలమల ద్వారా భూమిలో నుండి ఊరుతూ తేటతెల్లగా, మండిపడుతున్న వేసవి మిట్టమధ్యాహ్నపు ఎండలో కూడా చల్లచల్ల్‌ల్ల్‌ల్లగా నీరు. మహదానందం.

Canoeing in Weeki Wachee River. Spring fed, hence crystal clear waters, ice cold even on a mid summer afternoon. Bliss.

Water Lily/కలువ

Longwood Gardens - Water Lily
Exif: 70mm, F/4.5, 1/500s, ISO 400, Av mode, EC -0.3

అల్లి/ఉత్పలం/కువలయం/తొవ/వారిజం

తెలుగు పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి.

Please do let us know if there are any discrepancies/variations in names.

Florida Redbelly Turtle

Florida Redbelly Turtle
Exif: 200mm, F/4, 1/1600s, ISO 400, Av mode, EC -0.7

కూర్మం/కమఠం/తాబేలు

ఫ్లోరిడా రెడ్-బెల్లీ ఎక్కువగా చెరువులు, నీటిబుగ్గలు, వాగుల దగ్గెర గట్ల మీద చెట్ల మీద ఇలా వెచ్చని ఎండని అస్వాదిస్తూ కనిపిస్తుంటాయి. రూపురేఖల్లో పెనింసులా కూటర్‌/ఫ్లోరిడా కూటర్‌ అనే చుట్టాన్ని పోలి ఉంటుంది. ఆహారం నాచు, నీళ్ళల్లో పెరిగే మొక్కలు. పెంపుడు జంతువులుగానూ, అహారంగానూ కూడా ఎగుమతి అవుతూంటాయి(ట). గుడ్లు పెట్టేటప్పుడు ఒకోసారి వెళ్ళి దగ్గర్లో ఉండే మొసలి గూడులో పెట్టేసి వచ్చేస్తుంది, ఆ గుడ్ల రక్షణ కోసం. మొసలి ఈ గుడ్లు కూడా తన గుడ్లే అనేసుకుని జాగ్రత్తగా పొదిగేస్తుంది. అచ్చం మన కోకిల వెళ్ళి కాకి గూట్లో గుడ్లు పెట్టినట్టు. వివరాల్లో తప్పులు/తేడాలు ఉంటే తెలియపరచగలరు. 

Florida Redbelly is often seen basking on logs and shores along lakes, ponds, slow-flowing streams. It is closely related to the Peninsula Cooter/Florida Cooter. Aquatic vegetarian. Commonly exported for pet trade and consumption. These turtles sometimes lay their eggs in its neighbor's (alligator) nesting mounds, to protect them from predators. Alligator, thinking those are hers, protects and hatches them. Just like cuckoo eggs in crow's nest. Please do let us know if there are any discrepancies/variations in the name and other details given here. 

Gharial/మొసలి

Indian Gharial/Gavial
Exif: 200mm, F/4, 1/320s, ISO 1600, Av mode, EC -0.7

మకరం/శిశుమారం/గ్రాహం

Indian Gharialగా పిలవబడే ఈ మొసలి భారతఉపఖండంలోని ఉత్తరప్రాంతాలలో, ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర, మహానది మరియూ సింధూ నదీ పరీవాహక ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సన్నగా, పొడూగ్గా ఉండే నోరు, ఆ నోటి చివర్న బొడిపలాంటి ఆకారం (ముఖ్యంగా మగవాటికి) ప్రత్యేకతలు. Ghara, అనగా హిందీలో కుండ ఆకారంలో ఉన్న ఆ మూతిచివర బొడిప కారణంగానే దీనికి gharial అని పేరు వచ్చింది. ఈ జాతి మొసళ్ళు అతిపొడవైన మొసళ్ళు మాత్రమే కాదు, మిగతా మొసళ్ళకన్నా చురుకునైవి కూడా. (ఈ వివరాల్లో తప్పులు/తేడాలు ఉంటే తెలియపరచగలరు.) 

This crocodile-like reptile called Indian Gharial is native to northern regions of Indian Subcontinent, especially in the river systems of Ganga, Brahmaputra, Mahanadi and Indus. Long, narrow snout and bulbous growth at the the tip (especially for male gharials) are the characteristic features. The bulbous growth at the tip looks like a "Ghara" (Hindi word for pot), hence the name. Gharials are not only the longest but also quickest of the crocodilian order. (Please let us know if there are any discrepancies/variations in the details given here)

Water Lily/కలువ

Longwood Gardens/Water Lily
Exif: 70mm, F/4.5, 1/3200s, ISO 400, Av mode, EC 0

అల్లి/ఉత్పలం/కువలయం/తొవ/వారిజం

తెలుగు పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి.

Please do let us know if there are any discrepancies/variations in names.

Tarpon Springs

By the Sea..

టార్పన్‌ స్ప్రింగ్స్‌ గురించి, చరిత్రగన్న ఆ ఊరి తాలూకు అందాలు, బీచులు, గ్రీకు రెస్టారెంట్ల గురించి చాలా రోజులుగా వింటూ, వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. ఆఖరుకు మొన్న శనివారం మధ్యహ్నం నుండి వెళ్ళి కొంతసేపు బీచిలో కూర్చుని ఆకళ్ళు వేస్తున్నాయని తిని (ఒక చాలా మంచి గ్రీకు రెస్టారంట్లో. అక్కడ ఉన్నంత సేపూ నాకైతే నిజ్జంగా గ్రీకు దేశమ్లో ఉన్నట్టనిపించింది మరి) బయటకు వచ్చేసరికి చీకటిపడిపోయింది. అందుకే ఇంక ఊర్లో ఏమి తిరగకుండానే వెనక్కు వచ్చేసాము. పైన చూపిస్తున్న ఫొటో ఒక మామూలు బీచి ఫొటో అని, టార్పన్ స్ప్రింగ్స్ విశేషాలు దేనినీ ప్రతిబింబించటంలేదనీ తెలుసు. కేమరా బ్యాటరీ అయిపోవటం వల్ల అక్కడ ఎక్కువ ఫొటోలు తీయలేకపోయాను. మళ్ళీ ఒకసారి కొంచెం తీరికగా వెళ్ళి, మరిన్ని ఫొటోలు తీస్తాను. ఇంతకీ పైన చూస్తున్న ఫొటో హావర్డ్ పార్కు బీచిలో తీసింది.

We've been hearing about tarpon springs, its beautiful beaches, historic downtown and very nice greek restaurants and been wanting to go there for a while. Atlast, we went there this weekend, we were totally bowled over. I know this is just a typical beach fotograph and not exactly the picture that shows what Tarpon springs is all about. Unfortunately I couldn't take many pictures as the camera battery ran out of charge. Will go there soon and take more pictures, hopefully. This fotograph is at the Howard park beach(?).

ఉగాది శుభాకాంక్షలు..!!

వేపచివురు
ఉగాది శుభాకాంక్షలు..!! ( ఈ ఫొటో ముందే పోస్టు చేసేసినా, ఇప్పుడు సందర్భానికి ఇంతకన్నా సరిపోయే ఫొటో దొరకలేదు మరి. అందుకే కింద ఇంకో కొత్త ఫొటో. ప్రవాహం. పాత నీరు పోయి క్రొత్త నీరు రావటానికి సూచన?)
ప్రవాహం..

మా ఊరి ముచ్చట్లు..

Bayshore

ఇక్కడ మా ఊర్లో ప్రతీ సంవత్సరం జనవరిలో రెండు వారాంతాల్లో pirate festival జరుగుతుంది. దానికి హడావిడీ, ఏర్పాట్లూ నెల ముందు నుంచే మొదలుపెట్టేసారు. ఇంక వేరే ఏ సందర్భమ్లోనూ ఇంత హడావిడీ, ఇంత ఎత్తున ఏర్పాట్లూ చూడలేదు నేను ఇక్కడ. మొత్తం హడవిడి అంతా మా ఇంటికి చాలా దగ్గర్లో. మొన్న శనివారం kids pirate festival. ఈ వారం పెద్దవాళ్ళది. ఈ festival సందర్భంగా ముస్తాబు చేసిన pirate ship.

Pirate Ship
Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: ● 2012 ● 2011 ● 2010 ● 2007 ● 2006 ● 2005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8