Showing posts with label 06. Show all posts
Showing posts with label 06. Show all posts

సూర్యాస్తమయం


సూర్యాస్తమయం. It was not a planned shoot. అనుకోకుండా సాయంత్రం ఎక్కడినించో ఇంటికి వస్తుంటే దారిలో ఆగి మరీ తీశాను. ఆ రోజు ఈ ఫొటోలో కంటే చాలా బాగుంది దృశ్యం.
Exif: 70mm, F/4.5, 1/250, ISO 200, Av mode, EC: 0

బొమ్మలకొలువు..

ప్రతీ సంవత్సరం సంక్రాంతికి బొమ్మలకొలువు పెట్టుకోవటం అలవాటు. సంక్రాంతి అంటే నిజంగా పెద్ద పండగే ఇంట్లొ. ఎంత హడావిడో. వారం రోజులముందు నుంచి ప్లాన్లు, ఎన్ని మెట్లు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి.. ఏ బల్లలు, ఏ పెట్టెలు, ఏ పీటలు,ఏ చెక్కలు వాడాలి మెట్లకి. అని..ఆ నాలుగు రోజులు ఏ ముగ్గులు పెట్టాలి అని. రెండ్రోజుల ముందు కావిడి పెట్టెలు దించటం, ఏళ్ళనుంచి వస్తున్న బొమ్మలతోపాటు, కొత్తగా వచ్చి చేరుతున్న బొమ్మలన్నీ జాగ్రత్తగా చుట్టిపెట్టిన పెట్టెల్లోంచి తీయటం.. ఏవి పెట్టుకోతగ్గవిగా బాగున్నాయి, వేటిని ఇంక పక్కన పెట్టెయొచ్చు అని చూసుకోవటం, అన్ని శుభ్రాలు చేసుకోవటం.. ఒక్కో పాత బొమ్మ వెనకల అమ్మ చిన్నప్పటి కబుర్లు, అమ్మమ్మ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చింది, అమ్మ ఎప్పుడు ఏ బొమ్మ చేసింది అనీ.. ఒక పక్కన తమ్ముడు సాయం చేయటం లేదని విసుక్కోవటాలు, చందనం బొమ్మలు (బొమ్మలన్నిటికి లీడర్‌ టైపు.. వాటికి అగ్రతాంబూలం ఇవ్వాలి, 4 పూటలు ఆరగింపులు పెట్టాలి) శుభ్రం చేసి, నలుగు స్నానాలు చేయించి, అమ్మ కుట్టిన బట్టలు కట్టి, నగలు పెట్టీ అలంకరించటం. మెట్లు సర్ది, అన్ని బొమ్మలు ఒక్కోటీ చూసుకుంటూ ఏవి ఎక్కడ పెడితే బాగుంటందనిపిస్తుందో తెగ discussions, ఈలోపు ప్రతీసారీ సంక్రాంతికి వచ్చే అక్క (cousin) పెట్టే గోరింటాకు, అక్క పిల్లల హడావిడి, పేరంటానికి పిలుపులు, పనమ్మాయిని కళ్ళాపుకి పేడ తెమ్మని వెనకాల పడటం. రాత్రయ్యేసరికి ముగ్గుల రంగుల హడావిడి. భోగిరోజు పొద్దున్న (ముందురోజు రాత్రిపెట్టుకున్న)ముగ్గుకి రంగులు అద్దుతుంటే పక్కన తమ్ముడి భోగిమంట. ఇంక బొమ్మలు అన్నీ సర్దేక వాటి ఆరగింపులు, మన ఆరగింపులు, సంక్రాంతి రోజు సాయింత్రం పేరంటం హడావిడి.. చిన్నప్పుడు భోగిరోజు గొబ్బిళ్ళ హడావిడి ఉండేది. ఎప్పుడు ఆగిపోయిందో గుర్తు కూడా లేదు.

ఇక్కడికొచ్చిన అయిదేళ్ళూ ఇంట్లో అసలు సంక్రాంతికి హడావిడే లేదు. ఇక్కడయితే పండగ ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిందో తెలియనంతగా ఉంటుంది. ఈసారి మే నెలలో ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ పండగ లేకపోయినా పెట్టుకోవాల్సిందే అని పెట్టుకున్నాం. కానీ trips హడావిడి అలసటలో, ఓపికా, interest లేక ఏదో తూతూమంత్రం లా.. చిన్నగా తక్కువ బొమ్మలతో అయింది. తీరా అంతా పెట్టుకుని పేరంటానికి అందరూ వచ్చిన టైంకి.. పెద్ద గాలివాన..దానితో కరెంటు కూడా పోయింది. :-)..


చిన్న తిరుపతి - 5

చిన్న తిరుపతి - 4

చిన్న తిరుపతి - 3

చిన్న తిరుపతి - 2


చిన్న తిరుపతి ఫొటోలు చూస్తుంటే గుర్తొచ్చింది.. ఆ క్రితం రోజు చాలా మంచి ముహుర్తం ఉందనుకుంట.. ఆరోజు గుడిలో ఎంతమంది జంటలో పెళ్ళిబట్టలతో, తలమీద బట్టల మీద తలంబ్రాల పసుపు, నలిగిపోయిన పెళ్ళిదండలు, తలలో వాడిపోయిన పూలు.. కాని మొహాలు మాత్రం వికసించి.. ఒకపక్క అలసిపోయి ఉన్నా. కనీసం 70-80 జంటలు చూసుంటాం.. మా తమ్ముడు నేను సర్దాగా చాలా ఫొటోలు తీసాం. :-)

చిన్న తిరుపతి / ద్వారకా తిరుమల

శ్రీశైలం -2


శ్రీశైలంలో కృష్ణానది..

శ్రీశైలం


ఈరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చేసాను. చేసే పనేమి లేదు. ఎప్పుడో దేశం వెళ్ళివచ్చిన దగ్గెరనుంచి పోస్ట్ చేద్దమనుకుంటున్న ఫొటోలు చూస్తూ, ఒకోటి upload చేస్తున్నా. ఆ ఫొటోల పరంపరలో ఇది మొదటిది. శ్రీశైలం. May not be best pictures.. but just pictures from places I've been to this time.
(Dam in Sri Sailam, First of the series of photos I wanted to post since I got back from my recent trip to home)

Kick Start!


ఇది 20Dతో మొదటి ఫొటో.. మినీ కూపర్ నాకు నచ్చిన కార్లలో ఒకటి. Mini Cooper S red with white top and white stripes on the hood నా favorite combination.
Exif: Canon 20D, 50mm F1.8, 50mm, 1/60s, F/1.8, ISO 400, M mode

ఓడ


ఈ పాటుపడిపోయిన ఓడను నేను ఒకరోజు జాబ్‌ సైట్‌కి వేళుతుంటే చూసి వెనక్కి వచ్చేప్పుడు దారిలో ఆగి ఫొటోలు తీశాను. మళ్ళీ ట్రైపాడ్‌ తీసుకుని వెళ్ళాలి ఈ ప్రదేశానికి.... ఈ వయోవృద్ధురాలి సొగసుని ఆస్వాదించటానికి!!.
Exif: Nikon D50, 18~70mm, 70mm, F/8, 1/400, Av mode, ISO 200, EC: -1

వయొలెట్ పువ్వు



బిళ్ళ గన్నేరు.

ఈ ఫొటో కూడా Nikon D50 తోనే తీసినది. 18~70mm లెంస్‌ చాలా బాగుంది... kit lensతో అసలు పొంతనే లేదు. 70mm దగ్గర కూడ ఫొటోలు చాలా షార్ప్‌గా ఉన్నాయి.
Exif: Nikon D50, 18~70mm, 70mm, F/4.5, 1/640, ISO 200, M mode.

Alright, I guess I'm back.. :-)

Hibernation..

I hope I'll be back from my hibernation soon. Basically, I'm a lazy person.. added to that I got very busy with life, but not busy enough to take pictures :-). I did take lot of pictures, atleast some pictures amoung them are worthy enough to upload. I hope I'll upload them soon. BTW, I got a new lens too. 18-70 mm lens. So far working great. Liked the output. Thanks for all the comments while I was away, and sorry I dint even find enough time to respond. Thanks again for stopping by.

ఒకరికి ఒకరు


Exif: Nikon D50, Nikkor 18~70 mm lens, 18mm, F/4.5, ISO 200, Av mode, EC -0.7
ఇది ఫోర్ట్ డిసోటోలో తీసిన మరో ఫొటో. సాయంత్రం వేళ సూర్యుడి కిరణాలు.

జేంస్‌ కిం

సీనెట్‌ డాట్ కాం సీనియర్‌ ఎడిటర్‌ జేంస్‌ కిం ఇక లేరు. I've been following this news for a few days..... but it ended yesterday as a tragedy. థాంక్స్‌ గివింగ్‌ వీకెండ్‌ ట్రిప్‌కి వెళ్ళిన జేంస్‌ కిం (కుటుంభం) కారు ఒరెగాన్‌ స్టేట్‌లో మంచులో ఇరుక్కుపోయి..... సహాయం అందని పరిస్తితులలో కారులో గ్యాస్‌ ఉన్నంతసేపు హీటర్‌తో గడిపి గ్యాస్‌ అయిపోయిన తర్వాత కారు టైర్లు కాల్చి... ఇంకా సహాయం అందని పరిస్తితులలో భార్య ఇద్దరి పిల్లలకి (ఒకరు 7 నెలలు, మరొకరు 4 సంవత్సరాలు) టెంట్‌ వేసి తను సహాయం కోసం ఆ మంచుగా ఉన్న అడవులలోకి వెళ్ళి 11 రోజుల తర్వాత నిర్జీవంగా దొరికారు. హృదయవిదారకం...... Hats off to James Kim for sacrificing his life, for his family. 10 రోజుల గాలింపు తర్వత భార్య పిల్లలు ఒక ప్రైవేటు జెట్‌ ద్వారా కనుగొనబడి సురక్షితంగా ఉన్నారు. జేం కిం గురించి ఇక్కడ చూడండి.
Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8