Showing posts with label wildlife(వన్యప్రాణులు). Show all posts
Showing posts with label wildlife(వన్యప్రాణులు). Show all posts

Ibis/కంకణము

Ibis
Exif: 200mm, F/8, 1/1600s, ISO 400, Av mode, EC 0

కంకము/కంకణాయి/తెల్ల కంకణము/White Ibis/American White Ibis/दिधर/सफ़ेद बज़/मुन्ड

పేర్లలో తప్పులు తేడాలు ఉంటే చెప్పండి. భారత ఉపఖండంలోని పక్షుల వివరాలకి గూగుల్‌ బుక్స్‌లో ఉన్న ఈ పుస్తకం పాఆఆత పుస్తకమే కానీ మాలాంటి కొత్త బిచ్చగాళ్ళకి బాగానే పనికొస్తుందనిపించింది. వివిధ భారతీయ భాషల్లో పక్షుల పేర్లకి మాత్రమే ఐతే ఈ వెబ్సైటు బాగుంది.

Please let us know if there are any discrepencies/variations in names. I just came across this book in google books, which seems to be good reference, though a very old one, for birds in Indian subcontinent, especially to newbies like us. Vernacular names of indian birds can be found here.

Osprey with fish!

Osprey in action
200mm, F/4, 1/2000s, ISO 200, Av mode, EC: -0.3, AI Servo

టెనొరాక్‌ అనీ, కొన్నేళ్ళ క్రితం మూసేసిన ఒక మైన్‌సైటులో తీసాం ఫొటో. ఇలా పక్షులు చేపలని వేటాడటం చూడటమూ, ఫొటో తీయడమూ కూడా ఇదే మొదటిసారి మాకు. దగ్గరలోనే రెండు గూళ్ళు ఉండటం వల్ల, ఆస్ప్రే(సముద్రపుకాకి - పేరులోనే తప్ప ఇంకెక్కడా కాకికి సంబంధం లేదు, లేక కొరమీను గద్ద(?) ) తన పిల్లలకి ఆహారం కోసం వేటాడుతుందని అనుకున్నాం.

మీకు తెలుసా:
1. ఒక గూటిలో పిల్లా పెద్దా కలిసి రోజుకి 7-8 చేపలు తింటాయని? ఆడ ఆస్ప్రే పిల్లల దగ్గెర  ఉంటే, మగపక్షి రోజస్తమాను ఈ  వేట  హడావిడిలోనే ఉంటుందేమో ఇంక.
2. ఈ పక్షులు ఒకసారి జంటకట్టాయంటే సాధారణంగా జీవితాంతం కలసుంటాయని?

తెలుగు పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు, ENVIS వెబ్సైటు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి.

This picture was taken at a closed down mine site, now transformed into a fish management area and a great site for bird and random wildlife viewing. We were fortunate to witness and photograph (our first time) the hunting of Osprey (sea hawk) by diving into water to catch the fish! Spectacular! We saw a couple of osprey nests nearby and figured that it is breeding season and the osprey is hunting for the babies.

Do you know that:
1. Ospreys and babies in a nest will eat 7-8 fish per day? Guess the male bird will be busy almost all day hunting while the female stays close to the nest.
2. Ospreys usually mate for life?

Please do let us know if there are any discrepencies/variations that you know of in names or any other information.

Yellow Crowned Night Heron/చింతొక్క

IMG_2089 (3) (800x533)
Exif: 200mm, F/4, 1/800s, ISO 800, Av mode, EC -0.3

చింత వక్క/చింతొక్క అమెరికా ఖండాల్లోని కోస్తాప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న చేపలు, కప్పలు తదితరాలు ఆహారం.  గుడ్లు నీలo-ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. తెలుగు పేర్లకి ఆంధ్రభారతి, DSAL వెబ్సైట్లలో ఉన్న నిఘంటువులు, ENVIS వెబ్సైటు చూశాను. తప్పులు/తేడాలు ఉంటే చెప్పండి.

Yellow Crowned Night Heron  is a resident of Americas. Prey on frogs, aquatic insects, small fish. Eggs are in blue-green color. Please do let us know if there are any discrepancies/variations in the info here.

Florida Redbelly Turtle

Florida Redbelly Turtle
Exif: 200mm, F/4, 1/1600s, ISO 400, Av mode, EC -0.7

కూర్మం/కమఠం/తాబేలు

ఫ్లోరిడా రెడ్-బెల్లీ ఎక్కువగా చెరువులు, నీటిబుగ్గలు, వాగుల దగ్గెర గట్ల మీద చెట్ల మీద ఇలా వెచ్చని ఎండని అస్వాదిస్తూ కనిపిస్తుంటాయి. రూపురేఖల్లో పెనింసులా కూటర్‌/ఫ్లోరిడా కూటర్‌ అనే చుట్టాన్ని పోలి ఉంటుంది. ఆహారం నాచు, నీళ్ళల్లో పెరిగే మొక్కలు. పెంపుడు జంతువులుగానూ, అహారంగానూ కూడా ఎగుమతి అవుతూంటాయి(ట). గుడ్లు పెట్టేటప్పుడు ఒకోసారి వెళ్ళి దగ్గర్లో ఉండే మొసలి గూడులో పెట్టేసి వచ్చేస్తుంది, ఆ గుడ్ల రక్షణ కోసం. మొసలి ఈ గుడ్లు కూడా తన గుడ్లే అనేసుకుని జాగ్రత్తగా పొదిగేస్తుంది. అచ్చం మన కోకిల వెళ్ళి కాకి గూట్లో గుడ్లు పెట్టినట్టు. వివరాల్లో తప్పులు/తేడాలు ఉంటే తెలియపరచగలరు. 

Florida Redbelly is often seen basking on logs and shores along lakes, ponds, slow-flowing streams. It is closely related to the Peninsula Cooter/Florida Cooter. Aquatic vegetarian. Commonly exported for pet trade and consumption. These turtles sometimes lay their eggs in its neighbor's (alligator) nesting mounds, to protect them from predators. Alligator, thinking those are hers, protects and hatches them. Just like cuckoo eggs in crow's nest. Please do let us know if there are any discrepancies/variations in the name and other details given here. 

Purple Gallinule

IMG_0207 copy
ఈ పక్షి చూడటానికి, పావురం లాగ, కాకి లాగ (కాళ్ళ దగ్గెర), నెమలి రంగుల్లోనూ, ఎర్రటి ముక్కుతోనూ చాలా విచిత్రంగా భలే అందంగా ఉంది.సాధారణంగా ఈ పక్షి ఇలా చెరువుల్లోనే ఉంటుందంట.. నీళ్ళల్లో ఈదటం కాకుండా, ఇలా తామరాకుల మీద నడుస్తుంటుందనుకుంట, google imagesలో అన్నీ అవే ఫొటోలు. మరిన్ని విషయాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

Nature at work.


Exif: 300 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1

Exif: 214 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1

ఈ ఫొటో తీసినప్పుడు జరిగిన చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. కనిపించే నల్ల పక్షి పేరు anhinga (పాముబాతు), పెద్ద పక్షి పేరు great blue heron (నారాయణపక్షి/పాములనారిగాడు). ఆన్‌హింగా కి బొమికలు చాలా బరువు ఉండటం వల్ల ఎక్కువ వేగంగా ఎగరలేవు, ఇక నీటిలో వేటాడి చేపని పట్టుకున్నాక రెక్కలు మొత్తం తడిగా అయినప్పుడు ఒక కొమ్మ మీద కూర్చుని తన రెక్కలని ఆరబెట్టుకుంటుంది, లేకపోతే ఆ బరువుకి అస్సలు ఎగరలేదు. ఇక ఇప్పటి సంగతికి వస్తే ఆ ఆన్‌హింగా ఎంతో కష్టపడి తనకి మించిన వేటని పట్టింది, కానీ దాన్ని తినడానికి చాలా తంటాలు పడుతుంటే పక్కనే హెరాన్‌ కాచుకుని ఉన్నది. చివరికి ఆన్‌హింగా అలా కుస్తీలు పడుతూ ఒక్కసారి ఆ చేపని కింద పడేసింది. ఇంకేముంది, హెరాన్‌ ఒక్క ఉదుటన వెళ్ళి ఆ చేపని పట్టుకుని కాలవ అవతలి వడ్డున వాలింది. ఎగరలేని ఆన్‌హింగా అక్కడే కొమ్మ మీద ఉండిపోయింది. Nature at work అనిపించింది నాకు!

Sea gull (గౌరుకాకి)

DSC_4284 blog

Purple Gallinule


ఎవర్‌గ్లడ్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో కనిపించిన పర్పుల్‌ గాలినూల్‌. ఈ పక్షియొక్క విశిష్ఠత ఏమిటంటే ఆడ మగ పక్షులు గుడ్లని పొదిగి, పిల్లలని సాకుతాయంట. ఈ పక్షికి చలా దగ్గరలోనే మొసళ్ళు కూడా ఉన్నాయి. మంచి ఎకోసిస్టంని చూడటం ఎంతో ఆహ్లాదకరం (మానవ సమాజానికి దూరంగా...)
Exif: 300 mm, F/8, 1/250, ISO 100, Av mode, EC: -1

Great Egret (పెద్ద తెల్ల కొంగ) in flight!


సౌత్‌ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో bird photographyకి ఎన్నో అవకాశాలు.
Exif: 300 mm, F/8, 1/1000, ISO 100, Av mode, EC: -1

పిచ్చుక


ఈ పిచ్చుక గురించి కొద్దిగా పరిశోధన చేస్తే "Yellow-rumped Warbler" అనిపిస్తుంది. C.B. Rao గారు చెప్పగలరేమో మరి??
Exif: 300 mm, F/7.1, 1/400, ISO 100, Av mode, EC: -0.7

Sea gull (గౌరుకాకి)


Exif: 300mm, F/5.6, 1/1250, ISO 100, M mode
పైన్‌ ఐలాండ్‌లో ఈ సీగల్‌లు చాలా ఉన్నయి. చలిగా ఉన్నందువల్ల అన్నీ గుంపుగా ఎండకి ఎదురుగా నించున్నాయి.

పెలికాన్‌ పక్షి (చింకబాతు) 2


ఈ పక్షుల్ని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న కొల్లేటి సరస్సు పాఠం గురుకొస్తుంది.
Exif: 133mm, F/4.5, 1/1000, ISO 100, Av mode, EC: -0.3

పెలికాన్ పక్షి (చింకబాతు)


పెలికాన్ పక్షులకి కాళ్ళు బాతు కాళ్ళలాగా ఉంటాయని నాకు ఈ ఫొటో చూసేవరకూ తెలియదు. wildlife photography లోకి ఇదే నా అరంగేట్రం. I hope to do more of this. సెయిన్ట్ పీట్ బీచ్ దగ్గర చాలా పెలికాన్ పక్షులు ఉన్నాయి.
(ఈ పోస్ట్ లేఖిని ద్వారా సమకూర్చబడినది. వీవెన్ గారికి ధన్యవాదములు!!)
Exif: 149mm, F/4.5, 1/1600, ISO 100, Av mode, EC: -0.3
Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8