
Exif: 300 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1

Exif: 214 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1
ఈ ఫొటో తీసినప్పుడు జరిగిన చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. కనిపించే నల్ల పక్షి పేరు anhinga (పాముబాతు), పెద్ద పక్షి పేరు great blue heron (నారాయణపక్షి/పాములనారిగాడు). ఆన్‌హింగా కి బొమికలు చాలా బరువు ఉండటం వల్ల ఎక్కువ వేగంగా ఎగరలేవు, ఇక నీటిలో వేటాడి చేపని పట్టుకున్నాక రెక్కలు మొత్తం తడిగా అయినప్పుడు ఒక కొమ్మ మీద కూర్చుని తన రెక్కలని ఆరబెట్టుకుంటుంది, లేకపోతే ఆ బరువుకి అస్సలు ఎగరలేదు. ఇక ఇప్పటి సంగతికి వస్తే ఆ ఆన్‌హింగా ఎంతో కష్టపడి తనకి మించిన వేటని పట్టింది, కానీ దాన్ని తినడానికి చాలా తంటాలు పడుతుంటే పక్కనే హెరాన్ కాచుకుని ఉన్నది. చివరికి ఆన్‌హింగా అలా కుస్తీలు పడుతూ ఒక్కసారి ఆ చేపని కింద పడేసింది. ఇంకేముంది, హెరాన్ ఒక్క ఉదుటన వెళ్ళి ఆ చేపని పట్టుకుని కాలవ అవతలి వడ్డున వాలింది. ఎగరలేని ఆన్‌హింగా అక్కడే కొమ్మ మీద ఉండిపోయింది. Nature at work అనిపించింది నాకు!












