Exif: 300 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1
Exif: 214 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1
ఈ ఫొటో తీసినప్పుడు జరిగిన చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. కనిపించే నల్ల పక్షి పేరు anhinga (పాముబాతు), పెద్ద పక్షి పేరు great blue heron (నారాయణపక్షి/పాములనారిగాడు). ఆన్‌హింగా కి బొమికలు చాలా బరువు ఉండటం వల్ల ఎక్కువ వేగంగా ఎగరలేవు, ఇక నీటిలో వేటాడి చేపని పట్టుకున్నాక రెక్కలు మొత్తం తడిగా అయినప్పుడు ఒక కొమ్మ మీద కూర్చుని తన రెక్కలని ఆరబెట్టుకుంటుంది, లేకపోతే ఆ బరువుకి అస్సలు ఎగరలేదు. ఇక ఇప్పటి సంగతికి వస్తే ఆ ఆన్‌హింగా ఎంతో కష్టపడి తనకి మించిన వేటని పట్టింది, కానీ దాన్ని తినడానికి చాలా తంటాలు పడుతుంటే పక్కనే హెరాన్ కాచుకుని ఉన్నది. చివరికి ఆన్‌హింగా అలా కుస్తీలు పడుతూ ఒక్కసారి ఆ చేపని కింద పడేసింది. ఇంకేముంది, హెరాన్ ఒక్క ఉదుటన వెళ్ళి ఆ చేపని పట్టుకుని కాలవ అవతలి వడ్డున వాలింది. ఎగరలేని ఆన్‌హింగా అక్కడే కొమ్మ మీద ఉండిపోయింది. Nature at work అనిపించింది నాకు!
రెండు pics చాలా బావున్నాయి,.,.,.ఎంతసేపు wait చెసారు వీటికోసం.,,.great..మీ patience మెచ్చుకోవాలి..
ReplyDeleteThanks Pavan, I'm glad you liked 'em. పెద్దగా ఏమీ వెయిట్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. రెండు ఫొటోలూ వెంట వెంటనే తీశాను.
ReplyDelete