Showing posts with label Figurines(బొమ్మలు). Show all posts
Showing posts with label Figurines(బొమ్మలు). Show all posts
వినాయకుడు

Exif: 50mm, F/1.8, 1/125s, ISO 800, M mode
ఫ్రెండ్‌వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంటింట్లో మైక్రోవేవ్ మీద ఉన్న వినాయకుడు.... క్లిక్కకుండా ఉండలేకపోయాను.
ఫ్రెండ్‌వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంటింట్లో మైక్రోవేవ్ మీద ఉన్న వినాయకుడు.... క్లిక్కకుండా ఉండలేకపోయాను.
Labels:
07,
Deity(దేవుడు),
Figurines(బొమ్మలు),
still life,
vinayakudu(వినాయకుడు)
బొమ్మలకొలువు..
ప్రతీ సంవత్సరం సంక్రాంతికి బొమ్మలకొలువు పెట్టుకోవటం అలవాటు. సంక్రాంతి అంటే నిజంగా పెద్ద పండగే ఇంట్లొ. ఎంత హడావిడో. వారం రోజులముందు నుంచి ప్లాన్లు, ఎన్ని మెట్లు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి.. ఏ బల్లలు, ఏ పెట్టెలు, ఏ పీటలు,ఏ చెక్కలు వాడాలి మెట్లకి. అని..ఆ నాలుగు రోజులు ఏ ముగ్గులు పెట్టాలి అని. రెండ్రోజుల ముందు కావిడి పెట్టెలు దించటం, ఏళ్ళనుంచి వస్తున్న బొమ్మలతోపాటు, కొత్తగా వచ్చి చేరుతున్న బొమ్మలన్నీ జాగ్రత్తగా చుట్టిపెట్టిన పెట్టెల్లోంచి తీయటం.. ఏవి పెట్టుకోతగ్గవిగా బాగున్నాయి, వేటిని ఇంక పక్కన పెట్టెయొచ్చు అని చూసుకోవటం, అన్ని శుభ్రాలు చేసుకోవటం.. ఒక్కో పాత బొమ్మ వెనకల అమ్మ చిన్నప్పటి కబుర్లు, అమ్మమ్మ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చింది, అమ్మ ఎప్పుడు ఏ బొమ్మ చేసింది అనీ.. ఒక పక్కన తమ్ముడు సాయం చేయటం లేదని విసుక్కోవటాలు, చందనం బొమ్మలు (బొమ్మలన్నిటికి లీడర్ టైపు.. వాటికి అగ్రతాంబూలం ఇవ్వాలి, 4 పూటలు ఆరగింపులు పెట్టాలి) శుభ్రం చేసి, నలుగు స్నానాలు చేయించి, అమ్మ కుట్టిన బట్టలు కట్టి, నగలు పెట్టీ అలంకరించటం. మెట్లు సర్ది, అన్ని బొమ్మలు ఒక్కోటీ చూసుకుంటూ ఏవి ఎక్కడ పెడితే బాగుంటందనిపిస్తుందో తెగ discussions, ఈలోపు ప్రతీసారీ సంక్రాంతికి వచ్చే అక్క (cousin) పెట్టే గోరింటాకు, అక్క పిల్లల హడావిడి, పేరంటానికి పిలుపులు, పనమ్మాయిని కళ్ళాపుకి పేడ తెమ్మని వెనకాల పడటం. రాత్రయ్యేసరికి ముగ్గుల రంగుల హడావిడి. భోగిరోజు పొద్దున్న (ముందురోజు రాత్రిపెట్టుకున్న)ముగ్గుకి రంగులు అద్దుతుంటే పక్కన తమ్ముడి భోగిమంట. ఇంక బొమ్మలు అన్నీ సర్దేక వాటి ఆరగింపులు, మన ఆరగింపులు, సంక్రాంతి రోజు సాయింత్రం పేరంటం హడావిడి.. చిన్నప్పుడు భోగిరోజు గొబ్బిళ్ళ హడావిడి ఉండేది. ఎప్పుడు ఆగిపోయిందో గుర్తు కూడా లేదు.
ఇక్కడికొచ్చిన అయిదేళ్ళూ ఇంట్లో అసలు సంక్రాంతికి హడావిడే లేదు. ఇక్కడయితే పండగ ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిందో తెలియనంతగా ఉంటుంది. ఈసారి మే నెలలో ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ పండగ లేకపోయినా పెట్టుకోవాల్సిందే అని పెట్టుకున్నాం. కానీ trips హడావిడి అలసటలో, ఓపికా, interest లేక ఏదో తూతూమంత్రం లా.. చిన్నగా తక్కువ బొమ్మలతో అయింది. తీరా అంతా పెట్టుకుని పేరంటానికి అందరూ వచ్చిన టైంకి.. పెద్ద గాలివాన..దానితో కరెంటు కూడా పోయింది. :-)..


ఇక్కడికొచ్చిన అయిదేళ్ళూ ఇంట్లో అసలు సంక్రాంతికి హడావిడే లేదు. ఇక్కడయితే పండగ ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిందో తెలియనంతగా ఉంటుంది. ఈసారి మే నెలలో ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ పండగ లేకపోయినా పెట్టుకోవాల్సిందే అని పెట్టుకున్నాం. కానీ trips హడావిడి అలసటలో, ఓపికా, interest లేక ఏదో తూతూమంత్రం లా.. చిన్నగా తక్కువ బొమ్మలతో అయింది. తీరా అంతా పెట్టుకుని పేరంటానికి అందరూ వచ్చిన టైంకి.. పెద్ద గాలివాన..దానితో కరెంటు కూడా పోయింది. :-)..
Labels:
06,
Bommalakoluvu(బొమ్మలకొలువు),
Figurines(బొమ్మలు),
India(భారతం),
text
జయకృష్ణా ముకుందా మురారీ..

Exif: Nikon D50, F/5.6, 1/10, 55 mm, ISO 1600
Labels:
06,
Deity(దేవుడు),
Figurines(బొమ్మలు),
Krishna(కృష్ణుడు),
still life

Exif: Nikon D50, F/4.5, 1/60, 32 mm, ISO 1600
Labels:
06,
Books(పుస్తకాలు),
Figurines(బొమ్మలు),
Peacock(నెమలి),
still life
తిరిగి రంగంలోకి..
నాలుగేళ్ళ తరవాత నాలుగు వారాల ఇండియా trip అయ్యి మళ్ళీ ఇక్కడికి చేరి మూడు రోజులు అయింది.


Exif: Nikon D50, F/4.5, 1/60, 20 mm, ISO 200
Labels:
06,
Figurines(బొమ్మలు),
Flowers(పువ్వులు),
still life,
Water(నీరు)
చిన్ని కృష్ణుడు

నా గదిలో కృష్ణుడు.. చెట్టు కింద విశ్రాంతి గా కూర్చుని వెన్న తింటున్నాడు హాయిగా.. చుట్టూ పిట్టలు చేరి మరి మాకో అని ఆశ గా చూస్తున్నాయి. !! :-)
Labels:
05,
Figurines(బొమ్మలు),
Krishna(కృష్ణుడు)
Subscribe to:
Posts (Atom)
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
Tools-
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8