ప్రతీ సంవత్సరం సంక్రాంతికి బొమ్మలకొలువు పెట్టుకోవటం అలవాటు. సంక్రాంతి అంటే నిజంగా పెద్ద పండగే ఇంట్లొ. ఎంత హడావిడో. వారం రోజులముందు నుంచి ప్లాన్లు, ఎన్ని మెట్లు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి.. ఏ బల్లలు, ఏ పెట్టెలు, ఏ పీటలు,ఏ చెక్కలు వాడాలి మెట్లకి. అని..ఆ నాలుగు రోజులు ఏ ముగ్గులు పెట్టాలి అని. రెండ్రోజుల ముందు కావిడి పెట్టెలు దించటం, ఏళ్ళనుంచి వస్తున్న బొమ్మలతోపాటు, కొత్తగా వచ్చి చేరుతున్న బొమ్మలన్నీ జాగ్రత్తగా చుట్టిపెట్టిన పెట్టెల్లోంచి తీయటం.. ఏవి పెట్టుకోతగ్గవిగా బాగున్నాయి, వేటిని ఇంక పక్కన పెట్టెయొచ్చు అని చూసుకోవటం, అన్ని శుభ్రాలు చేసుకోవటం.. ఒక్కో పాత బొమ్మ వెనకల అమ్మ చిన్నప్పటి కబుర్లు, అమ్మమ్మ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చింది, అమ్మ ఎప్పుడు ఏ బొమ్మ చేసింది అనీ.. ఒక పక్కన తమ్ముడు సాయం చేయటం లేదని విసుక్కోవటాలు, చందనం బొమ్మలు (బొమ్మలన్నిటికి లీడర్ టైపు.. వాటికి అగ్రతాంబూలం ఇవ్వాలి, 4 పూటలు ఆరగింపులు పెట్టాలి) శుభ్రం చేసి, నలుగు స్నానాలు చేయించి, అమ్మ కుట్టిన బట్టలు కట్టి, నగలు పెట్టీ అలంకరించటం. మెట్లు సర్ది, అన్ని బొమ్మలు ఒక్కోటీ చూసుకుంటూ ఏవి ఎక్కడ పెడితే బాగుంటందనిపిస్తుందో తెగ discussions, ఈలోపు ప్రతీసారీ సంక్రాంతికి వచ్చే అక్క (cousin) పెట్టే గోరింటాకు, అక్క పిల్లల హడావిడి, పేరంటానికి పిలుపులు, పనమ్మాయిని కళ్ళాపుకి పేడ తెమ్మని వెనకాల పడటం. రాత్రయ్యేసరికి ముగ్గుల రంగుల హడావిడి. భోగిరోజు పొద్దున్న (ముందురోజు రాత్రిపెట్టుకున్న)ముగ్గుకి రంగులు అద్దుతుంటే పక్కన తమ్ముడి భోగిమంట. ఇంక బొమ్మలు అన్నీ సర్దేక వాటి ఆరగింపులు, మన ఆరగింపులు, సంక్రాంతి రోజు సాయింత్రం పేరంటం హడావిడి.. చిన్నప్పుడు భోగిరోజు గొబ్బిళ్ళ హడావిడి ఉండేది. ఎప్పుడు ఆగిపోయిందో గుర్తు కూడా లేదు.
ఇక్కడికొచ్చిన అయిదేళ్ళూ ఇంట్లో అసలు సంక్రాంతికి హడావిడే లేదు. ఇక్కడయితే పండగ ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్ళిందో తెలియనంతగా ఉంటుంది. ఈసారి మే నెలలో ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ పండగ లేకపోయినా పెట్టుకోవాల్సిందే అని పెట్టుకున్నాం. కానీ trips హడావిడి అలసటలో, ఓపికా, interest లేక ఏదో తూతూమంత్రం లా.. చిన్నగా తక్కువ బొమ్మలతో అయింది. తీరా అంతా పెట్టుకుని పేరంటానికి అందరూ వచ్చిన టైంకి.. పెద్ద గాలివాన..దానితో కరెంటు కూడా పోయింది. :-)..

baagundandi.
ReplyDeleteనాకు మా వూళ్ళో చేసుకున్న సంక్రాంతి పండగ గుర్తొచ్చింది !!
ReplyDeleteఒకసారి, నా వయసు 10-15 మధ్యలో ఉంటుందేమో !
భోగిమంట అనుకుంటూ మా పక్కనే ఉన్న గుడిశ అంటిచాము, నేను మా తమ్ముళ్ళూ కలిసి !
మంట పెద్దది అయ్యాక గప్ చుప్ అంటూ ఇంటికి వచ్చి పడగ్గదిలో మంచము కింద దాక్కున్నాము !!
పెద్దవ్వాళ్ళు అంతా కలిసి నిప్పు అర్పారు కాబట్టి పెద్ద ప్రమాదము తప్పింది !!
Thanks Radhika, Raghuram..!! :-)
ReplyDelete