ఆవు/ గిడ్డి/ గోవు/ తొర్రు/ శృంగిణి/ సౌరభేయి/ కుర్రి (పాలిచ్చే ఆవు/పాలావు/పాడియావు)/ దోగ్ధ్రి (పాడియావు)/ ధేనువు (పాడియావు)/ నర్ర (కొమ్ములు గల ఆవు)/ నైచికి (మంచి గుణములు గల ఆవు)/ పయస్విని (పాడియావు)/ పుల్లావు (brown colored cow)/ పైరం (పాడియావు)/ మొదవు (పాడియావు)/ సుకర (tame cow).
ఈ ఫొటో తీసిన రెండ్రోజులకి బుజ్జి దూడ పుట్టింది ఈ ఆవుకి.
The cow gave birth to a cute little calf 2 days after I took this picture.
చాలా బాగుంది। ఈ మధ్యన అంతగా ఫోటోలు తీస్తున్నట్టు లేరు।
ReplyDeleteనా దగ్గర బ్లాగవలసిన ఫోటోలు చాలా వున్నాయి ఇంకా బ్లాగవలసివుంది।
నా కెమెరా పాడయ్యింది। ఈ మధ్యనే కొత్తది కొన్నాను। పరీక్షల సమయమని ఇంకా పెట్టెలోనుండి తెఱవకుండా అట్టేపెట్టాను।
కాలీపోర్నియా వస్తే తెలుపండి।
మీకు నచ్చినందుకు, మీ ఆహ్వానానికి సంతోషం రాకేశ్.! ఫొటోలు తీస్తూనే ఉంటాంగానీ, బ్లాగటంలేదు పెద్దగా. నిజానికి మంచి ట్రిప్పులు, బ్లాగగలిగేంత బాగానే ఉన్న ఫొటోలు కొంచెం ఎక్కువే ఉన్నాయి, అలా ఎక్కువుంటేనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యి మొత్తానికి పక్కన పెట్టేస్తుంటాను/ము. ఈ మధ్య పెద్దగా బ్లాగుల వైపు నేను రావడంలేదుగానీ, మీరేంటీ మా తూ.గో. వదిలి మళ్ళీ మా/మీ పరదేశంలో పడ్డట్టున్నారు? మీ పరీక్షలకి good luck. ఉగాది, కొత్త సంవత్సరం కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మీరు కూడా మా ఫ్లోరిడా వస్తే చెప్పండి. BTW, మీ కాలిఫోర్నియా, ముఖ్యంగా, శాన్‌ఫ్రాన్సిస్కో, one of my favorite places. అప్పుడెప్పుడో ఒక పదిరోజులుండి భూతలస్వర్గం అని నిర్ధారించాము.
Deleteనా జీవితాశయం ఏమిటంటే, శంకరగుప్తం దగ్గరలో అటు గోదారికీ ఇటు సముద్రానికీ దగ్గరగా రెండెకరాల కొబ్బరివ్యవ్యసాయం యంత్రాలు లేకుండా చెయ్యాలని :D
ReplyDeleteఈ పుల్లావు దానికి చిహ్నంగా వుంది।
కాలిఫోర్నియా స్వర్గమే అందులో సంశయం లేదు। కానీ భగవద్గీతలో (౨-౪౨) స్వర్గపరాయణులను ఒక మోస్తరుగానే తిట్టాడు శ్రీకృష్ణుఁడు ;-)