Cavern/గుహ

Caverns
Exif: 10mm, F/4.5, 1/25s, ISO 800, Av mode, EC -0.7

మరియనా దగ్గెర చిపోల నదిలో కయాకింగ్ చేస్తుండగా "అవెన్‌స్‌" అని పిలవబడే ఈ గుహ చూసాము. సుమారు వెయ్యి అడుగుల పొడవు ఉందట. గుహలు మరియూ geology (భౌమశిలావిన్యాసం) గురించి కొంచెం చెప్పాలి. U.S.లోని ఈ ప్రాంతం యొక్క అధారశిల/bedrock సున్నపురాయి/limestone. ఈ సున్నపురాయి ఎలా రూపొందిందీ..? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా సముద్రానికి అడుగున ఉండేది. కాలక్రమేనా నీరు వెనక్కి తగ్గటం వల్ల, గవ్వలు, జలచరాల అస్థిపనంజరాలు, మడ్డితో ఉన్న ఒకప్పటి సముద్రపు అడుగుభాగం గట్టిబడి సున్నపురాయిగా మారింది. నీటిలో సులువుగా కరిగే గుణమున్న సున్నపురాయి weak acidic waterతో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలు కరుగుతూ, కొన్నివందల సంవత్సరాలకి  గుహలుగా ఏర్పడతాయి. ఉదా: బొర్రా గుహలు. (బహుశా తూ.గో.జి పెద్దాపురంలో పాండవులమెట్ట (సున్నపురాతికొండ) మీద ఉన్న గుహ కూడా ఇలాగే ఏర్పడి ఉంటుందేమో?)

Came across this cave called "The ovens" while kayaking along Chipola River in Marianna. This cave is about 1000 feet long. Bit of intro to caves and geology: This part of US is underlain by limestone as bedrock. Used to be sea floor millions of years ago. As water receded, the one time sea floor with shells, corals and sediments hardened to form limestone. The solubility of limestone in water and weak acid solutions leads to karst landscapes where acidic groundwater dissolves the calcium-carbonate and carrying it away in solution creating sinkholes as well as cave passages large enough to walk through. Ex. Borra Caves in AP. (May be the cave on Pandavula Metta (limestone outcrop) in Peddapuram formed in a similar way?)

10 comments:

  1. బాగుందండి మీ వివరణ,ఫోటో కుడా

    ReplyDelete
  2. థాంక్సండీ.. :-)

    ReplyDelete
  3. బాగుందండి..మీ ఫోటో, మీ వివరణ కూడ...! అయితే బొర్రాగుహలకన్న ఇంకా పొడవైనా పెద్ద గుహలు కర్నూల్ జిల్లా కోయలకుంట్ల వద్ద నున్న " బెలుంగుహలు " ఉన్నాయి

    ReplyDelete
  4. కమల్‌, మీరు చెప్పే వరకు ఇప్పటివరకు ఎప్పూడూ బెలుం గుహలు గురించి వినలేదండీ, వెతికి చూస్తే వాటి గురించి బోలెడంత information, ఫొటోలూ ఉన్నాయి. పరిచయం చేసినందుకు థాంక్స్‌. ఫొటోలు కూడా మీవి ఏవైనా ఉంటే పెట్టండి. మేము India వచ్చినప్పుడు వెళ్ళటం కుదిరినా కుదరకపోయినా, అక్కడే ఉన్న మా తమ్ముడికి చెప్ప్తా, బాగానే్ interest.

    ReplyDelete
  5. Good one and thanks for the explanation.

    Meeru ee madhya kotta photos pettinattu leru :(

    ReplyDelete
  6. నాకు ఫొటో కనిపించట్లేదండీ :(

    ReplyDelete
  7. @ఆ.సౌమ్య
    మీకు గుహ ఫొటో కనిపించడం లేదా లెక పైన కనిపించే ఫొటో header అనుకుని పొరపాటు పడ్డారా ?!!


    @పవన్/చేతన గారు,
    కొద్దిగా header కి Title కి మధ్య కొద్దిగా స్పేస్ వుంటే బావుంటుందేమో. అలాగే మీ ఓల్డ్ పోస్ట్స్ చూడడానికి బ్లాగ్ ఆర్కైవ్ గాడ్జెట్ కూడా వుంటే బావుంటుంది. Also if possible remove word verification for comments. ఉచిత సలహాలిచ్చానని తిట్టుకోకండి :-)

    ReplyDelete
  8. @బద్రి
    హి హి లేదండీ,నాకు ఏ ఫొటో కనిపించటీఅదు. మీరంత గుహ గుహ అంటూ ఉంటే ఓహో అనుకోవడమే తప్ప నాకు ఏగుహ కనిపించాట్లేదు. :(

    ReplyDelete
  9. బద్రి గారి పుణ్యమా అని ఫొటో చూసాను. చాలా బావుంది మీ వివరణ కూడా.
    Thanks to you and Badri!

    ReplyDelete
  10. బద్రీ, సౌమ్యా - thanks, మీ complimentsకి, సూచనలకి. Archivesకి gadjet ఏమీ లేదు కానీ, బ్లాగు footerలో yearly archivesకి links ఉన్నాయి చూడండి. Spammerల బాధ తట్టుకోలేక word verification పెట్టాను. మీరు చెప్పాక ఇప్పుడు తీసేసాను ప్రస్తుతానికి. ఇక బ్లాగు హెడర్‌కి, contentకి మధ్యలో ఖాళీ సంగతి కూడా templateలోకెళ్ళి చూడాలి ఎప్పుడో.

    ReplyDelete

Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8