Showing posts with label Geology(భూవిజ్ఞానం). Show all posts
Showing posts with label Geology(భూవిజ్ఞానం). Show all posts

Arches National Park

Exif: 35mm, F/2, 1/800s, ISO 100, Av mode, EC -0.3. [ Canon 5D and 35mm f/2 - A very happy marriage. Love the vignette at shallow depths of field ]

ఉదయకిరణాలలో మెరుస్తున్న Arches National Park లోని "Windows" ప్రాంతం.  చరిత్ర లాగే భూవిజ్ఞానం కూడా భలే ఆసక్తిగా అనిపిస్తుంది ఈమధ్య. ఈరోజు మనం ఎంతో అందంగా ఉన్నాయని చూస్తున్న కొండలూ, గుట్టలూ, లోయలూ, గుహలు ఏర్పడటానికి, గాలి, నీరు, నిప్పు, అగ్నిపర్వతాలు, భూకంపాలు లాంటి ప్రాకృతిక కారకాల ద్వారా కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందన్న విషయం ఎంతో చోద్యంగా ఉండటమే కాదు, ఈ జగన్నాటకంలో మనిషి జీవితకాలం ఎంత చిన్నదీ, మన బాదరబందీలూ/గొడవలూ ఎంత అల్పమైనవీ అని కూడా అనిపిస్తుంది.  మొత్తానికి, ఆగ్నేయ యూటా (Southeastern Utah) ట్రిప్పు చాలా హృద్యంగా గడిచింది. అసలు బయల్దేరడమే చాలా హఠాత్తుగా, అప్పటికప్పుడు అనుకుని బయల్దేరడం (అదీ ఏకంగా ఈ మూలున్న ఫ్లోరిడా నుంచి) కూడా అందుకు చాలా తోడ్పడింది.  

"Windows" section of the Arches National Park glowing at sunrise. Lately, we started realizing that we love geological perspective of places, as much as historical perspective. The fact that what you now see as beautiful arches, caves, landscapes took millions of years of deposition and erosion due to natural forces such as water and air, and other geological events such as earthquakes, volcanic eruptions etc., makes it so so interesting, as well as makes one realize how minuscule/insignificant/petty one's life and day-to-day issues/concerns are compared to the big picture. Overall, had a great time in Southeastern Utah for labor day weekend. The trip being as impromptu as it can get, all the way from Florida, added so much more to the experience.

Apache Trail

Apache Trail near Fish Creek

Exif: 22mm, F/5.6, 1/640s, ISO 200, Av mode, EC -0.3

ఏ మాత్రం plan చేసుకోకుండా, ఏంచూడబోతున్నామో ఏమాత్రం అవగాహన కూడా లేకుండా బయల్దేరిన మేము ఆరోజు కళ్ళకీ, మనసుకీ, కేమరాకి కూడా అంత ఇంపుగా గడుస్తుందని ఊహించలేదు. అగ్గిగుగ్గిలంలా ఉండే ఆరిజోనా వెళ్ళటానికి అది సరైన సమయం కూడా. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుంది.

Truly rewarding day. Totally unplanned and unprepared for the views and the experience. Perfect time for the perfect weather in Arizona too. Can't wait to get back out there!

Cavern/గుహ

Caverns
Exif: 10mm, F/4.5, 1/25s, ISO 800, Av mode, EC -0.7

మరియనా దగ్గెర చిపోల నదిలో కయాకింగ్ చేస్తుండగా "అవెన్‌స్‌" అని పిలవబడే ఈ గుహ చూసాము. సుమారు వెయ్యి అడుగుల పొడవు ఉందట. గుహలు మరియూ geology (భౌమశిలావిన్యాసం) గురించి కొంచెం చెప్పాలి. U.S.లోని ఈ ప్రాంతం యొక్క అధారశిల/bedrock సున్నపురాయి/limestone. ఈ సున్నపురాయి ఎలా రూపొందిందీ..? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా సముద్రానికి అడుగున ఉండేది. కాలక్రమేనా నీరు వెనక్కి తగ్గటం వల్ల, గవ్వలు, జలచరాల అస్థిపనంజరాలు, మడ్డితో ఉన్న ఒకప్పటి సముద్రపు అడుగుభాగం గట్టిబడి సున్నపురాయిగా మారింది. నీటిలో సులువుగా కరిగే గుణమున్న సున్నపురాయి weak acidic waterతో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలు కరుగుతూ, కొన్నివందల సంవత్సరాలకి  గుహలుగా ఏర్పడతాయి. ఉదా: బొర్రా గుహలు. (బహుశా తూ.గో.జి పెద్దాపురంలో పాండవులమెట్ట (సున్నపురాతికొండ) మీద ఉన్న గుహ కూడా ఇలాగే ఏర్పడి ఉంటుందేమో?)

Came across this cave called "The ovens" while kayaking along Chipola River in Marianna. This cave is about 1000 feet long. Bit of intro to caves and geology: This part of US is underlain by limestone as bedrock. Used to be sea floor millions of years ago. As water receded, the one time sea floor with shells, corals and sediments hardened to form limestone. The solubility of limestone in water and weak acid solutions leads to karst landscapes where acidic groundwater dissolves the calcium-carbonate and carrying it away in solution creating sinkholes as well as cave passages large enough to walk through. Ex. Borra Caves in AP. (May be the cave on Pandavula Metta (limestone outcrop) in Peddapuram formed in a similar way?)
Creative Commons License
Important Note: This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-Share Alike License. You can copy and share the photos provided you attribute the work to us. You may use the photos for non-commercial purposes, but with prior permission from us. Altered and transformed work based on the photos may be distributed under same or similar license.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Archive: 201220112010200720062005
Tools-
People: Pavan, Chetana
Camera: Canon 5D, Canon 20D
Lens: 10-22mm f/3.5-4.5, 35mm f/2, 70-200mm f/4L, Minolta MD 50mm f/1.4, Sigma 70-300mm f/4-5.6
Flash: Speedlite 430EX
Previous Gear: Canon 30D w/ 50mm f/1.8, Nikon d50 w/ 18-70mm f/3.5-4.5, 50mm 1.8