ఈరోజు పొద్దున్న లేచిందగ్గెర నుంచి చేసిన ఒకేఒక్క పని ఈ పుస్తకం అవగొట్టటం.. అన్ని కథలూ బాగున్నాయి...కాని మంచి కథలన్నీ ఆఖరికి అట్టే పెట్టినట్టు,షోడా నాయుడు బాగుందే అనుకుంటే దాని తర్వాత బామ్మ మురుగు ఇంకా బాగుంది, దని తర్వాత పెళ్ళి కూడ బాగుంది.. కానీ ఆఖరులో వచ్చే మిథునం మరీ బాగుంది. దీంట్లో ఒక విషయం చెప్పాలి..
దాంట్లోని మొక్కల చెట్ల విషయాలు: గన్నేరులూ, గోరింటలూ, మునిగోరింటలూ, రేగికంపా, గచ్చపొదలు, తాడిచెట్లూ, తేనెపట్లూ, మొవ్వల్లో కాకిగూళ్ళూ, గురివిందలూ, కాశీరత్నాలూ, శంఖుపూల తీగెలూ, మందారం, మకరం, విచ్చిన పత్తికాయలు, కొబ్బరి బొండాలూ-మట్టలూ, అరటిచిట్లూ, అల్లం మోసులూ, కంద పిలకలూ, వంగలూ, మిరపలూ, కాకర, దొండ, బీర పాదులూ, బాదం, ములగ చెట్లూ, కరివేపకు, కూరాకులూ, ఇంటి ముందు గుమ్మడిపాదు, ఇల్లెక్కిన ఆనప్పాదూ, తులసి, కాగడా మల్లె, కనకాంబరాలూ, దవనం, మరువం, చేమంతీ, ఉసిరిచెట్టూ, పారిజాతం, తమలపాకు తీగెలూ, బచ్చలి కాడలూ, పెండలం ఆకులూ, గోగులూ, బెండలూ, దోసపూత, నిమ్మచెట్టూ, జామకాయలూ, కొబ్బరి గెలలూ, మామిడి పూత, పొట్ల పాదు, చిక్కుడు గింజలూ, వేపచేట్టూ, ఉల్లి మడీ..
అబ్బ స్వ్ర్గర్గం.. ఆ ఇంట్లో ఎనభై ఏళ్ళు పైబడ్డ అప్పదాసుగారూ బుచ్చిలక్ష్మి.. పూటకి ఏదో ఇంత ఉడకేసుకుని తిని కృష్ణా రామా అనుండటం కాదు.. వాళ్ళు తినేవి..
అరటి కాయలు ఆవపెట్టి కూరా, తోటకూర పప్పు, వంకాయ బజ్జి పచ్చడీ అందులోకి కొత్తిమీర ఎలా వేయాలంట.. ఉంది కదా అని వేసెయ్యటం కాదంట, తత్వాలు పాడుతున్నప్పుడు తంబూరా సృతిలా ఉండాలంట, అప్పటికప్పుడు దూసి వేసిన కర్వేపాకుతో చారు, ముసలావిడకి పళ్ళు లేకపోయినా ముసలాయిన నమిలి ఇచ్చిన జామ గుజ్జు, పెరట్లో ఎండపెట్టిన/పెడుతున్న వంగ దోస ఒరుగులూ, మామిడి టెంకలూ, గుమ్మడి వడియాలూ, అప్పడాలు, చల్ల మిరపకాయలూ, తెలగపిండీ, వేపపూత, చిట్టింతపొట్టు, రేగొడియాలు, పులుసు, ఇంగువ ఉదారంగావేసిన తిరుగుమాత, అటక మీద ఊరగాయ, అరటాకులో తురుముకున్న కొబ్బరితో దోరగావేగిన నూపప్పు పోపుతో రోటి పచ్చడి, లేత అరిటాకులో వడ్డించిన వేడి వేడి అన్నం, పిండి పులిహోరా, అల్లప్పచ్చడి, మజ్జిగ, అరటిపళ్ళు,గిత్తివంకాయకూర,కంద బచ్చలి,మంచి గుమ్మడి శెనగపప్పు, పనసపొటు ఆవపెట్టు, అరటికాయ అంటు పులుసు, బొండుమల్లెల్లా విచ్చుకున్న వరిపేలాలు ఉప్పూకారం ఓ నేచుక్కా చిటికెడు జీలకర్వేపలూ వేసి, జున్ను, శనగలు, ఆవిరికుడుములూ, కందళ్ళూ, పొంగరాలూ, వేరుశనగకాయలూ..
ఇవన్నీ కథకి embellishments మాత్రమే.. కానీ ఇవి లేకుండా కథ లేదనుకోండీ.. నాకు చాలా నచ్చిన, నచ్చి పేర్లు గుర్తున్న కథల్లోకి ఇదీ చేరిపోయింది. వాటిలో తెలుగునాడి లో చదివిన మహమ్మద్ ఖదీర్ బాబు గారి "కింద నేల ఉంది" ఒకటి..!
BTW, telugunaaDi చాలా చాలా మంచి మాసపత్రిక, అందరూ చదివి తీరాల్సిన పత్రిక, చందా కేవలం 24 డాలర్లు మాత్రమే. 24 డాలర్లు మనం ఎన్ని అనవసర ఖర్చులకి వాడం? దయచేసి చందాదారులుకండి.ఒక మంచి పత్రికని miss అవుతున్నారు. ఇంకోమాట, నాకూ తెలుగునాడికి నేను కట్టిన చందా, నాకు నెలానెలా వచ్చే పత్రిక తప్ప ఇంకే సంబంధం లేదు.
http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=13215&page=1
ReplyDeleteeee e-pustakam chadivaaraa? too good...
iddaru ramanalu okalle anukunta!?
అవునండీ, ఇద్దరు రమణలు ఒక్కరే..! నేను ఆ పేరడీ చదివాను.. చాలా బాగుంటుంది..Thanks for reminding మళ్ళీ చదవాలి...!
ReplyDeleterailu banDilO vaithAlikulu annadi chAlA baaguntundi ee pEraDIlalo...
ReplyDeletei was ROTFL when i read it sometime back.
annattu eee kadha kUDA undandi onlinelo...
http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=SREERAMANA
:)
ReplyDelete