
దీపస్తంభం/దీపగృహం
కొన్నాళ్ళ క్రితం సెలవలకి Northern Californiaలో వెళ్ళినప్పుడు San Francisco-Big Basin Redwoods State Park దారిలో ఈ లైట్‌హౌస్ కనిపించింది. బాగుంది కదా అని ఫొటో తీసుకున్నామే కానీ అప్పట్లో మాకు తెలియనిది- 115 అడుగుల ఎత్తున్న ఈ కట్టడం US యొక్క పశ్చిమకోస్తాతీరప్రాంతంలో అతి పెద్ద లైట్‌హౌస్ అని మాత్రమే కాదు, ఆ ప్రక్కనే ఉన్న నాలుగు ఇళ్ళు కలిపి అక్కడ youth hostel నిర్వహిస్తున్నారని కూడా తెలియలేదు. ఆ హాస్టల్లో సాయంత్రాలు సూర్యాస్తమయంతో పాటూ బెలీన్ తిమింగలాలను చూస్తూ, రాత్రుళ్ళు ఆరుబయట లక్షల నక్షత్రాలతో పాటూ అకాశంలోనూ అలల్లోనూ తచ్చట్లాడుతున్న చంద్రుడ్ని చూస్తూ ఆ అలల హోరుకి నిద్రపోతే ఎంత బాగుంటుందీ.. !! ఒక మాంఛి అవకాశం తప్పిపోయింది.
During our vacation in Northern California sometime back, we came across this lighthouse on our way to Big Basin Redwoods State Park from San Francisco. What we didn't know at that time was- not just that this 115-foot high lighthouse is the tallest of its kind in on the West Coast of the United States, but also that the few houses just adjacent to lighthouse are operated as a Hostel. How cool would it be to spend your evenings watching gray whales and sunsets, nights watching zillions of stars and moon reflecting in the waters below and sleep to the sound of waves crashing against the rocks!!! One missed opportunity.